Mirai Censor Talk: హనుమాన్ తర్వాత తేజ ఖాతాలో మరో హిట్.. 'మిరాయ్' సెన్సార్ టాక్ ఇదే !

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ ఫాంటసీ డ్రామా 'మిరాయ్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

New Update

Mirai Censor Talk: యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ ఫాంటసీ డ్రామా 'మిరాయ్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A అంటే పెద్దలతో పాటు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న  పిల్లలు కూడా ఈ చిత్రాన్ని చూడవచ్చు. కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఎలాంటి కట్స్ లేకుండా  'మిరాయ్' సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రం మరో 3 రోజుల్లో అంటే సెప్టెంబర్ 12న  థియేటర్స్ లో విడుదల కానుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ మరియు ఇతర భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో అందుబాటులోకి రానుంది. 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జతో పాటు మంచు మనోజ్, శ్రీయ సరన్, జగపతి బాబు, జయం రవి  వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటించారు. తేజ సజ్జ జోడీగా యంగ్ బ్యూటీ  రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది.  ఇందులో తేజ ఒక సూపర్ యోధాగా కనిపించబోతున్నాడు. 

కథ ఏంటి 

మిరాయ్' కథ ఒక యోధుడి చుట్టూ తిరుగుతుంది. అయితే  అశోక చక్రవర్తి  కాలం నాటి  తొమ్మిది పవిత్ర గ్రంథాలను ఒక  దుష్టశక్తి  నుంచి కాపాడడానికి వచ్చిన యోధుడి కథే  మిరాయ్.  ఈ గ్రంథాలకు  మనిషిని దేవుడిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి.  ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ (VFX) , అడ్వెంచర్ యాక్షన్ సన్నివేశాలు  చాలా గ్రాండ్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో ఈ స్థాయి గ్రాఫిక్స్ నిర్మించడం విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'హను-మాన్' తర్వాత తేజ సజ్జ నుంచి వస్తున్న మరో భారీ సినిమా 'మిరాయ్'. ఈ సినిమా కూడా సూపర్ హిట్  అవుతుందని  అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read:Aa Naluguru: అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!

Advertisment
తాజా కథనాలు