Prabhas Marriage: ఇది నిజమేనా..? పెళ్లి పై ప్రభాస్ క్లారిటీ

హీరో ప్రభాస్ పెళ్లి రూమర్ల పై ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.

New Update
Prabhas marriage

Prabhas marriage

Prabhas Marriage: టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.  హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు, దీనికి ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్పినట్టు వార్తలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వివాహ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

Also Read :  ఒక్క రోజే ఓటీటీలోకి నాలుగు సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ 

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ టీమ్.. ఈ వార్తలపై స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. 45 ఏళ్ళ ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలను నిరాశపరిచారు.  ఇదిలా ఉంటే గతంలోనూ ప్రభాస్ పెళ్లి పై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారని ఓ సారి, ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారంటూ మరోసారి పుకార్లు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. 

Also Read: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి.. ప్రస్తుతం ఫౌజీ,  రాజా సాబ్‌తో సహా  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, రాజా సాబ్ షూటింగ్ లు ఇప్పటికే మొదలవగా.. 'స్పిరిట్' త్వరలో పట్టాలెక్కనుంది.  

prabhas marriage latest update | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates

Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!

Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు