Prabhas : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!

ప్రభాస్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆయన నటించిన 'కల్కి' మూవీ జపాన్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్లాల్సి ఉండగా.. మూవీ షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

New Update
prabhs

పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తోంది. ఏ ఏడాది 'కల్కి2898AD' సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా తాను షూటింగ్ లో గాయపడ్డానని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ మూవీ జపాన్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ప్రభాస్ అక్కడికి వెళ్ళలేదు. ఈ క్రమంలోనే జపాన్‌ అభిమానుల కోసం ఓ పోస్టు పెట్టాడు. 

Also Read :  శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్

publive-image

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

నన్ను క్షమించాలి..

‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా.." అని పోస్ట్ పేర్కొన్నాడు. 

Also Read :  ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ త్వరగా కోలుకోవాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కాగా ప్రభాస్ ఇలా షూటింగ్ లో గాయపడటం కొత్తేమి కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు గాయపడ్డాడు. ఇక 'రాజాసాబ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రభాస్ ఇప్పటివరకూ కనిపించని సరికొత్త పాత్రలో  అలరించనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10, 2025న విడుదల కానుంది.

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

Advertisment
తాజా కథనాలు