Mr. Perfect : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. Mr.పర్ ఫెక్ట్ రీ రిలీజ్

ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబర్ 22 న 'Mr. ఫ‌ర్‌ఫెక్ట్' సినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. బుకింగ్స్ సైతం స్టార్ట్ అయిన‌ట్లు తెలిపింది. ఈ మూవీతో పాటూ ఈశ్వ‌ర్‌, రెబల్, స‌లార్‌ సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.

New Update
mr perfect

Mr Perfect Re-release: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ నెల 23 న పుట్టిన రోజు జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటించిన ఈశ్వ‌ర్‌, రెబల్, స‌లార్‌ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరింది. ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా 'మిస్టర్ పర్ ఫెక్ట్'. అప్ప‌టివ‌ర‌కు మాస్ ఇమేజ్‌తో ఉన్న ప్ర‌భాస్‌కు ఈ మూవీ ఒక్క‌సారిగా ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

Also Read : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

డైరెక్టర్ దశరథ్ ఈ సినిమాతో ప్రభాస్ ను పూర్తిగా మార్చేసి సూపర్ స్టైలిష్ లుక్ లో చూపించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , తాప్సి హీరోయిన్స్ గా నటించారు. 2011 ఏప్రిల్ 21న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. 

Also Read : 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

బుకింగ్స్ ఓపెన్..

ప్రభాస్ బర్త్ డే (Prabhas Birthday) కానుకగా ఈ సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 22 న 'Mr. ఫ‌ర్‌ఫెక్ట్' సినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ బుకింగ్స్ స్టార్ట్ అయిన‌ట్లు తెలిపింది.  ఈశ్వ‌ర్‌, రెబల్, స‌లార్‌ సినిమాలతో పాటూ  'Mr. ఫ‌ర్‌ఫెక్ట్' కూడా రీ రిలీజ్ కాబోతుండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Also Read : సీఎం రేవంత్ ను కలిసిన రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్.. ఎందుకో తెలుసా!?

మరోవైపు ఈసారి డార్లింగ్ బర్త్ డే రోజు కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో హను రాఘవపూడి- ప్రభాస్ మూవీకి సంబంధించి గ్లింప్స్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు స్పిరిట్, సలార్ 2 సినిమాల నుంచి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి.

Also Read : వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు