Devi Sri Prasad
Devi Sri Prasad: టాలీవుడ్ రాక్ స్టార్, నేషనల్ అవార్డు విజేత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. లైవ్ ఇండియా టూర్ లో భాగంగా.. దేవి తన ఫస్ట్ లైవ్ కాన్సెర్ట్ ను హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ ను ACTC అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది. డీఎస్పీ సూపర్ హిట్ చార్ట్ బస్టర్స్ తో కాన్సర్ట్ మారుమోగిపోనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లోనే దేవి పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన లైవ్ కాన్సెర్ట్ అంటే ఫ్యాన్స్ సంతోషం మామూలుగా లేదు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి దేవి ఆహ్వానం
ఈ నేపథ్యంలో తాజాగా దేవి శ్రీ ప్రసాద్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను స్వయంగా కలిసి హైదరాబాద్ లో జరగబోయే తన కాన్సర్ట్ కు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్స్ కోసం www.actcevents.com వెబ్ సైట్, Paytm ఇన్‌సైడర్ ద్వారా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: 'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.
— RTV (@RTVnewsnetwork) October 16, 2024
ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్.#DeviSriPrasad #RevanthReddy… pic.twitter.com/u1OTI6z8hj
Also Read: PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!
Also Read: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్