Posani Krishna Murali Telling Truth | సంచలన విషయాలు చెప్పిన పోసాని | YS Jagan | RTV
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి కి ఉపశమనం లభించింది. విజయవాడ కోర్టుతో పాటు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు.
రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి.
రిమాండ్ ఖైదీగా జైల్లో పోసాని కృష్ణమురళి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పోసాని ఆరోగ్యంపై సినీ నటి పూనం కౌర్ స్పందించారు. పోసాని ఆరోగ్యం పట్ల కాస్త దిగులుగా ఉందని, ఆయనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.