తమిళనాట ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. నటి పూనమ్ కౌర్ ట్వీట్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల ఈ వివాదంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ను లాగిన ఈమె.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ పెట్టింది. అందులో తనతో పాటు ఓ సోషియో ఫాంటసీ సినిమాలో నటించిన హీరోయిన్‌ను ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది.
Also Read: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా?
" ఆ హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసి ఆకస్మాత్తుగా ఇండస్ట్రీని విడిచి పెట్టింది. ఆ హీరోయిన్ ఇటీవల ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించి నాకు షాకింగ్ విషయాలు చెప్పింది. తాను ఇండియాకు వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దని ఆ హీరోయిన్ నన్ను కోరింది. ఓ హీరో తనను వేధిస్తున్నాడని, ఎక్కడకు వెళ్తే అక్కడకు ఫాలో అవుతున్నాడని చెప్పింది.
Also Read : నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్
ఇది కట్టు కథ కాదు..
ఓ సినిమాలో ఇంటిమెటెడ్ సీన్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. డైరెక్టర్ కూడా హీరోను వారించలేదని, ఇప్పటికీ ఆ హీరో వేధిస్తూనే ఉన్నాడని తెలిపింది. నేను తనను హగ్ చేసుకోని ఓదార్చాను, ఇది కట్టు కథ కాదు.." అంటూ తన ట్వీట్ లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది.
దీంతో ఆ హీరోయిన్, హీరో ఎవరన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ కావొచ్చంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా.. హీరో ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరి దీనిపై పూనమ్ కౌర్ ముందు ముందు ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Also Read : 900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
Also Read: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు