900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్

బీహార్ పాట్నాలో జరిగిన 'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 2 లక్షల మందిఈవెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించినట్లు తెలుస్తోంది.

New Update
patna (1)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. బిహార్‌లోని పాట్నాలో భారీ ఈవెంట్‌ ఏర్పాటు చేసి మరీ పుష్ప-2 ట్రైలర్‌నులాంచ్ చేశారు. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. 

అయితే ఈ ఈవెంట్ కు బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలో 'పుష్ప' క్రేజ్ చూసి అంతా షాక్ అయ్యారు. ఈ ఈవెంట్ కు సుమారు 2 లక్షల మంది జనాలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక భద్రతా పరంగా ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు ఈ కార్యక్రమంలో గస్తీ కాశారు.

Also Read : ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా?

ఇదే మొదటిసారి..

900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించారు. ఒక ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కు నార్త్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉందని స్పష్టమవుతుంది. 

ఇక 'పుష్ప2' ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ట్రైలర్ పైనే చర్చ నడుస్తోంది. ట్రైలర్ లో అల్లు అర్జున్ విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు

Advertisment
Advertisment
తాజా కథనాలు