నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ 'మెకానిక్ రాకీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ట్రోలర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను ఇలాగే మాట్లాడతా, మీరెవ్వరు ఏం పీకలేరు అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు. దీంతో విశ్వక్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 18 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న వరంగల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సినిమా గురించే కాకుండా ట్రోలర్స్, రివ్యూయర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను ఇలాగే మాట్లాడతా, మీరెవ్వరు ఏం పీకలేరు అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు. దీంతో విశ్వక్ సేన్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. Also Read : 900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇలాగే ప్రమోట్ చేసుకుంటా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ట్రోలర్స్ ను ఉద్దేశిస్తూ.." మీకే చెప్తున్నా. మీరు నన్ను ఏమి పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా. ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా. నేనేమి తప్పు చెయ్యట్లేదు. సినిమాలు చేస్తున్నాము. నేను ట్రోల్ చేసిన వాళ్ళను, నా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను నేనేమి అనను. ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడను. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా ఏం కామెంట్ చేసినా పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయొద్దని కోరుతున్నా. క్రిటిక్స్ రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది. Also Read : ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా? ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా.." అని అన్నాడు. దీంతో విశ్వక్ సేన్ వ్యాఖ్యల్ని పలువురు నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. #mechanic-rocky #vishwak-sen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి