/rtv/media/media_files/2025/10/07/bigg-boss-2025-10-07-14-13-32.jpg)
స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB), బెంగళూరు శివార్లలోని బిడది హోబ్లీలో ఉన్న బిగ్ బాస్ కన్నడ నిర్మాణ స్థలానికి నోటీసు ఇచ్చింది. చికిత్స చేయని మురుగునీటిని బయటికి విడుదల చేయడంతో పర్యావరణ కాలుష్యం జరుగుతున్నట్లు బోర్డు గుర్తించింది. నిర్మాణ సంస్థ 250 కేఎల్‌డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దానికి సరైన డ్రైనేజీ కనెక్షన్లు లేవని, ఆ యూనిట్లను ఉపయోగించకుండా మూలన ఉంచారని తనిఖీలో తేలింది.
Also Read : Nitish Kumar: నితీష్ నిశ్శబ్దం.. గౌరవప్రదమైన వీడ్కోలు దక్కేనా? బీహార్‌లో ఏం జరగబోతోంది!
The #Karnataka State Pollution Control Board has ordered the closure of the #BiggBossKannada shooting location at Vels Studio in #Bidadi,citing violations of air/water #pollution norms.Sewage treatment plant is non-functional and 2.5 lakh litres of untreated wastewater found. pic.twitter.com/mGqeLDwzzI
— Yasir Mushtaq (@path2shah) October 7, 2025
చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థకు
శుద్ధి చేయని నీటిని బహిరంగంగా విడుదల చేయడం వల్ల చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.ఈ ఉల్లంఘనల కారణంగా, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మారే వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని బోర్డు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీని ఆదేశించింది. ఈ చర్యల వల్ల బిగ్ బాస్ కన్నడ షో కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ఇప్పుడు ఆగిపోతుందా అన్న చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి
బిగ్‌బాస్ కన్నడ 12 సీజన్ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈసారి మొత్తం హౌస్‌లోకి 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు.అభిషేక్, అశ్వినీ ఎస్, అశ్వినీ జీ, చంద్రప్రభ, సుధీర్, సతీష్, ధనుష్, ధ్రువంత్, గిల్లి నట, జాన్వీ, కావ్య, మల్లమ్మ, మాలు ఎన్, మంజు భాషిణి, రాశిక, రక్షిత, స్పందన, ఆర్జే అమిత్, కరిబసప్ప లిస్టులో ఉన్నారు. వీరిలో తొలి వారం ఆర్జే అమిత్, కరిబసప్పలు ఎలిమినేట్ కగా.. రక్షితను హౌస్‌మేట్స్ ఎలిమినేట్ చేశారు.