/rtv/media/media_files/2025/10/07/nitishkmr-2025-10-07-16-24-30.jpg)
Nitish Kumar: బీహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈసారి వాతావరణం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికీ ఎలాంటి నినాదాలు, ప్రకటనలు చేయలేదు. దీంతో నితీష్ మౌనం వెనక అంతర్యమేమిటనే చర్చలు మొదలయ్యాయి. గెలుపు తమదేననే నమ్మకం, కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ కారణంగా మోదీ మంత్రం తనను గెలిపిస్తుందనే ధీమాతోనే నిశ్శబ్దంగా ఉంటున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నితీష్ కు ఇదే చివరి ఎన్నికలని, ఇక ఘనమైన వీడ్కోలు దక్కేలా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు బీహార్ లో ఏం జరగబోతోంది? నితీష్ బలాలేంటో తెలుసుకుందాం.
మరోసారి నితీష్ కుమార్..
అయితే 2015నుంచి 'మరోసారి నితీష్ కుమార్!' అనే నినాదం బీహార్ లో ప్రబలంగా ఉంది. ఈ నినాదమే నితీష్ ను బీహార్‌లో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. స్థిరత్వం, అభివృద్ధికి చిహ్నంగా పరిగణించే వ్యక్తిగా ఎదిగారు. అయితే ఈ 2025 ఎన్నికలు భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. బహిరంగ ర్యాలీలకు బదులు నిశ్శబ్దంగా ప్రచారాలు జరుగుతున్నాయి. గ్రామాలు, చిన్న పట్టణాల్లో, JD(U) కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఇది నితీష్ విజయ రహస్యంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఓట్ల కోసం గొంతు చించుకుంటుండగా నితీష్ టీమ్ మాత్రం సైలెంట్ గా పని కానిచ్చేస్తోంది. స
నితీష్ బలం మహిళలే..
నితీష్ బలం బీహార్ మహిళలపైనే ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం (MMRY) కింద ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 ఇచ్చారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి సాధికారత కల్పించడానికి మొత్తం లక్ష్యం రూ.10,000 కోట్లు ఖర్చు చేశారు. నితీష్ ప్రభుత్వం 14 మిలియన్ల మంది మహిళలతో కూడిన 1.1 మిలియన్ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. 2006లో బీహార్ పంచాయతీ రాజ్ సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం గమనించదగ్గ విషయం. 2013లో పోలీసు సర్వీసులలో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించారు. ఈ ప్రయత్నాలు మహిళలను ఓటు బ్యాంకుగా బలోపేతం చేశాయి. అందువల్లే ప్రతి ఎన్నికల్లో మహిళల సపోర్టు నితీష్ కుమార్‌కు ప్రయోజనకరంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లల దగ్గుకు సిరప్ అవసరమే లేదు.. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
పార్టీ లేని నాయకుడు..
ఇక చాలా మంది నితీష్ కు ఇది చివరి పదవీకాలంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ గెలుపును ఛాలెంజ్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటముల గురించి కాకుండా.. నితీష్ ఆత్మవిశ్వాసం, అనుభవానికి పరీక్షగా నిలవనున్నాయి. నితీష్ కు ఇవే చివరి ఎన్నికలని, ఎలాగైనా గెలిపించి ఘనంగా వీడ్కోలు పలకాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. మరోవైపు ప్రతిపక్షాలు కొత్త ఓటర్లను, యువ ఆశావహులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ నితీష్ పై కనిపించని విశ్వసనీయత, నమ్మకం ప్రజల్లో ఉంది. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కొద్దిమంది నాయకులలో నితీష్ కుమార్ ఒకరు. కాగా మహిళలు, అన్ని కులాల్లో తన సొంత ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. దీంతో ఆయనకు 'పార్టీ లేని నాయకుడు' అనే మారుపేరు వచ్చింది.