Sirisha Lella: పవన్ సినిమాలో చంద్రబాబు కోడలు! వైరల్ అవుతున్న అప్డేట్

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓజీ సినిమాలో నారా రోహిత్ భార్య శిరీష లెల్ల కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

New Update

Sirisha Lella: హరిహర వీరమల్లు తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్  'ఓజీ'. తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: Singer Smita: సింగర్ స్మిత ఇంట్లో కరోనా కలకలం!

నారా రోహిత్ భార్య

పవన్  'ఓజీ'  సినిమాలో నారా రోహిత్ కాబోయే భార్య శిరీషలెల్ల కీలక ప్రాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. శిరీషలెల్ల కొద్ది రోజుల క్రితం హీరో నారా రోహిత్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రతినిధి 2 సినిమాతో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. 

Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వస్తున్న ఈ చిత్ర ఇటీవలే మళ్ళీ షూటింగ్ మొదలైనట్లు చిత్రబృందం ప్రకటించింది.  'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా.. ఫ్యాన్స్ లో అంచనాలను భారీగా పెంచేసింది. 

telugu-news | cinema-news | telugu-cinema-news | pawan-kalyan-og-movie | nara rohith wife Sirisha Lella 

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు