OG Trailer Date: 'OG' ప్లానింగ్ మామూలుగా లేదుగా.. బ్యాక్ 2 బ్యాక్ ప్రమోషన్స్ షురూ..!

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 15న ‘గన్స్ అండ్ రొసెస్’ సాంగ్, 19న బుకింగ్స్ ఓపెన్, 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 'OG' గ్లింప్స్ తో సినిమాపై హైప్ పెరిగింది.

New Update
OG Trailer Date

OG Trailer Date

OG Trailer Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ (OG Movie) సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ నుంచి సినీ విశ్లేషకుల వరకు అందరూ ఈ సినిమాపై భారీగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా, గతంలో విడుదలైన ‘ఓజీ గ్లింప్స్’ ఈ హైప్ కి మెయిన్ రీజన్.

‘ఫైర్ స్టార్మ్’ హై - ‘సువ్వి సువ్వి’ ఫ్లాట్..?

ఈ గ్లింప్స్ తర్వాత వచ్చిన ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో అభిమానులను ఫుల్ హైలోకి తీసుకెళ్లింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సువ్వి సువ్వి’ సాంగ్‌కి మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం కొంత నిరాశకు గురి చేసింది. పాటలో కొత్తదనం లేదని, బీట్ కూడా బలంగా లేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతానికి ప్రమోషన్స్‌లో కొంత వెనక్కి తగ్గారు.

Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?

ట్రైలర్ పై ఫుల్ ఫోకస్.. (OG Trailer Date)

అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాపై మరింత హైప్ పెంచే పనిలో పడ్డారు మేకర్స్, దర్శకుడు సుజీత్ ట్రైలర్ కట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడట. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 18 లేదా 20న 'ఓజీ' ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా విడుదలకు కనీసం వారం ముందు ట్రైలర్ వస్తే అడ్వాన్స్ బుకింగ్స్(OG Advance Bookings) దుమ్ము దులపడం ఖాయం.

పెద్ద సినిమాలకు మొదటి వీకెండ్ టికెట్ బుకింగ్స్ చాలా కీలకం. వీక్ డేస్‌లో కూడా థియేటర్స్ నిండాలంటే ట్రైలర్‌కు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అంత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ ట్రైలర్‌ ను అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ సుజీత్.

Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

ఇప్పటికే ట్రైలర్‌కు నాలుగు వేరియేషన్స్ కట్ చేసినట్టు సమాచారం. అయితే అన్నింటికీ దాదాపు ఒకే నిడివి - రెండు నిమిషాలు ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు తమన్ ఇచ్చిన బీజీఎం ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తుందని టాక్. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతీ సినీ లవర్స్ అందరూ ఈ ట్రైలర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, మరో పక్క ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో సెప్టెంబర్ 15న 'గన్స్ అండ్ రొసెస్'(GUNS AND ROSES) అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 19న మూవీ బుకింగ్స్ ఓపెన్ చేసి, 20న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  

Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

అమెరికాలో ఇప్పటికే OG అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది, పవన్ కళ్యాణ్ సినిమాలకి ఉండే మాస్ ఫాలోయింగ్ తో 'OG' క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. దీంతో, రిలీజ్ రోజున భారీ ఓపెనింగ్స్ వసూలయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!

ఇక 'OG' సినిమా విషయనికొస్తే, ఈ సినిమాను DVV దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, హరిష్ ఉత్తమన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'OG' మ్యూజిక్ తో తమన్ మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడు.

Advertisment
తాజా కథనాలు