/rtv/media/media_files/2025/09/12/manchu-vishnu-2025-09-12-16-51-22.jpg)
Manchu Vishnu
Manchu Vishnu: తేజ సజ్జా(Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా(Mirai Movie) సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా, పాన్ వరల్డ్ లెవెల్‌లో, అనేక భాషల్లో ఒకేసారి విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో, మంచి ఓపెనింగ్స్ రాబడుతుంది. ఈ సందర్భంగా 'మిరాయ్' సినిమా విజయం కావాలని కోరుకుంటూ మంచు విష్ణు ట్వీట్(Manchu Vishnu Tweet on Mirai Movie) చేశారు.
Wishing all the best for #Mirai. God speed to the entire team.
— Vishnu Manchu (@iVishnuManchu) September 12, 2025
అయితే, మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్(Manchu Manoj) మధ్య ఉన్న గ్యాప్ పలు సందర్భాల్లో బయటపడింది. ఒక దశలో అయితే, ఈ వివాదం పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
అయితే, తాజాగా రిలీజైన ‘మిరాయ్’ సినిమాతో వారి మధ్య గొడవలు సర్దుమణిగాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటించగా, సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు, సినిమా విజయాన్ని కోరుతూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. దీనికి మనోజ్ కూడా సానుకూలంగా స్పందించి, “థాంక్యూ అన్నా” అంటూ, తన తరపున అలాగే ‘బ్లాక్ స్వర్డ్’ పాత్ర తరపున ధన్యవాదాలు తెలిపారు. దీంతో వీరి మధ్య ఉన్న విబేధాలు కాస్త తగ్గాయని, మంచు ఫ్యామిలీ మళ్ళీ ఒక్కటవుతోందని స్పష్టమవుతోంది.
ఇక మిరాయ్ విషయనొస్తే, ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధుడిగా కొత్తగా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీన్లు, ఫైట్స్, విజువల్స్ అన్నీ హై స్టాండర్డ్ లో ఉండేలా రూపొందించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్ అన్నీ కూడా కొత్తగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ చూసినవారికి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అని ముందుగానే అర్థమైపోయింది.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
ప్రభాస్ వాయిస్ ఓవర్ (Prabhas Voice Over in Mirai)
ఈ సినిమా మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సినిమా మొదట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. చిత్రబృందం ఇది అధికారికంగా ముందే వెల్లడించలేదు. కానీ రిలీజ్‌కి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో తేజ సజ్జ వెల్లడించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
Also Read:లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!
ప్రభాస్ వాయిస్‌తో మొదలయ్యే ఓపెనింగ్ నేరేషన్, సినిమాకు కొత్త లెవెల్‌లో ఎనర్జీ తీసుకురావడమే కాకుండా, ఆయన అభిమానులకు ఇది బిగ్ ట్రీట్ గా మారింది. ఆయన స్వరమే సినిమా ఆరంభానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒకవైపు మంచు బ్రదర్స్ ట్వీట్ లు, మరోవైపు తేజ సజ్జా సూపర్ సక్సెస్, అలాగే ప్రభాస్ వాయిస్ ఓవర్ వంటి హైలైట్స్‌తో "మిరాయ్" సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. విజువల్స్, యాక్షన్, కంటెంట్ అన్ని పరంగా మిరాయ్ కొత్తగా ఉండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఇది తేజ కెరీర్‌లో మరో బిగ్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.