Ravi Mohan: EMI కట్టలేదని స్టార్ హీరో ఇల్లు వేలానికి! ఇంటి ముందు బ్యాంక్ అధికారులు (వీడియో వైరల్)

తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేస్తామని నోటీసులు పంపారు అధికారులు.

New Update
ravi mohan

ravi mohan

Ravi Mohan: తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేస్తామని నోటీసులు పంపారు అధికారులు. అయితే గత 11 నెలలుగా ఇంటికి సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించకపోవడంతో ఇంటిని జప్తు చేస్తామని ఇంటి తలుపులకు నోటీసులు అతికించారు.  ఒక స్టార్ హీరో ఇంటి విషయంలో బ్యాంక్ అధికారులు తీసుకున్న ఈ చర్య నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అయితే రవి మోహన్ కి నోటీసులు పంపించడం ఇదేం మొదటి సారి కాదట. దీనికి ముందు బ్యాంక్ అధికారులు అనేక సార్లు రిమైండర్లు పంపించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెబుతున్నారు.దీంతో చివరికి బ్యాంకు అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకుని, వేలం వేసేందుకు సిద్ధమయ్యారు.

 రవి మోహన్ ఈ బంగ్లాను కొనుగోలు చేసేటప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారని, దానికి సంబంధించిన నెలవారీ వాయిదాలు చాలా పెండింగ్ లో ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిపై రూ. 7.60 కోట్ల బకాయి ఉందని తెలిపారు.

వేలానికి ఇల్లు

గడువు తేదీలోపు బకాయిలు చెల్లించకపోతే ఇంటిని వేలానికి వేస్తామని తెలిపారు. కొద్దిరోజులుగా భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం కారణంగా రవి ఆయన గర్ల్ ఫ్రెండ్ కేనీషాతో ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇంటి ఈఎంఐ చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని నటుడు రవిని విమర్శిస్తున్నారు నెటిజన్లు. 

ఇంటి వివాదంతో పాటు పలు ఇతర వివాదాలను కూడా ఎదుర్కుంటున్నారు నటుడు రవి మోహన్. గతంలో టచ్ గోల్డ్ అనే నిర్మాణ సంస్థ రెండు సినిమాల్లో నటించేందుకు ఆయనకు రూ. 6 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కానీ రవి మోహన్ ఆ సినిమాల్లో నటించకుండా ఇతర ప్రాజెక్టులు ఒప్పుకున్నారని సదరు నిర్మాణ సంస్థ ఆరోపించింది. దీంతో నిర్మాణ సంస్థ కూడా తిరిగి తమ డబ్బులు పొందెందుకు ఇంటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఆర్ధిక సమస్యలతో పాటు భార్య ఆర్థి విడాకుల వ్యవహారంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రవి మోహన్. గత కొంతకాలంగా భార్యతో విభేదాల కారణంగా విడాకులు కావాలని కోట్లు మెట్లెక్కారు.

ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. భార్య ఆర్థితో తన 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ  గతేడాది విడాకులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరో వైపు ఆర్థి మాత్రం ఈ ప్రకటన తనను షాక్ కి గురించేసిందని పోస్ట్ పెట్టారు. తమ మధ్య విభేదాలకు మూడో వ్యక్తి కారణమని ఆరోపించారు. అయితే రవి మోహన్  సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీన్ని ఉద్దేశిస్తూనే ఆర్థి పరోక్షంగా మూడో వ్యక్తి అంటూ పోస్టులు పెట్టినట్లు తెలిసింది.

Advertisment
తాజా కథనాలు