OG Movie Record: రిలీజ్‌కి ముందే OG రికార్డ్.. వేలంలో ఒక్క టికెట్ ధర రూ.5లక్షలు

అమెరికాలో ఓజీ టికెట్ ఒకటి ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. సినిసిమా ఫస్ట్ టికెట్‌ను వేలం వేయగా టీమ్‌ పవన్ కల్యాణ్‌ నార్త్ అమెరికా రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది. వారు ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు.

New Update
pawan kalyan OG glimpse

pawan kalyan OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. అమెరికాలో ఓజీ టికెట్ ఒకటి ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. సినిసిమా ఫస్ట్ టికెట్‌ను వేలం వేయగా టీమ్‌ పవన్ కల్యాణ్‌ నార్త్ అమెరికా రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది. వారు ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు. సుజీత్‌ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఓజీ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ ఆన్‌లైన్ వేలం పవన్‌ కల్యాణ్ పుట్టినరోజున ఘనంగా జరిగింది. ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు అభిమానులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ అభిమానుల నార్త్ అమెరికా బృందం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ఓజీ' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ టికెట్ బుకింగ్స్ కూడా అమెరికాలో రికార్డు సృష్టించాయి. ఇప్పటికే $1 మిలియన్ ప్రీ-సేల్స్ మార్కును దాటిన తొలి తెలుగు చిత్రంగా 'ఓజీ' నిలిచింది.

Advertisment
తాజా కథనాలు