OG Advance Bookings: బీభత్సం భయ్యా..! హాట్ కేకుల్లా "OG" మెల్‌బోర్న్‌ ఐమ్యాక్స్ టికెట్ సేల్స్..

OG సినిమా మీద అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మెల్‌బోర్న్ ఐమ్యాక్స్‌లో టికెట్లు నిమిషాల్లో సేల్ అవుట్ కావడం, అమెరికాలో బుకింగ్స్ శరవేగంగా జరగడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 'OG' సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది.

New Update
OG Trailer Date

OG Advance Bookings

OG Advance Bookings:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘OG’ సినిమాపై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్, గ్లింప్స్, పాటలు... ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతోంది, ఇవన్నీ చూస్తుంటే సినిమాపై ఏ రేంజ్ లో హైప్ ఉందో అర్థమవుతుంది.

ఇది కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా 'OG' ఫీవర్ ఎంతగా పాకిపోయిందంటే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ థియేటర్‌లో టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, అదనపు షోలు వేసేందుకు థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఓ తెలుగు సినిమా అంత త్వరగా విదేశాల్లో టికెట్లు సాల్డ్ అవుట్ కావడం అనేది తక్కువే. ఇది పవన్ కళ్యాణ్ స్థాయిని,  పవర్ స్టార్ అభిమానుల క్రేజ్‌ను మరోసారి ప్రూవ్ చేస్తోంది.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

ఇక ఇండియాలో అయితే 'OG'పై ఉన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో విడుదలైన గ్లింప్స్ వీడియో కి భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, పాటలతో బజ్ పెరిగిన 'OG'కి, ఇప్పుడు మేకర్స్ మరింత హైప్ తేవాలని ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, సెప్టెంబర్ 18 లేదా 20న ట్రైలర్(OG Trailer) విడుదల చేసే అవకాశం ఉంది. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ట్రైలర్ కట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడట. ట్రైలర్ రిలీజ్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉండేలా చూస్తున్నారు.

భారీ వసూళ్లు.. 

ఒక పెద్ద సినిమా సక్సెస్ కావాలంటే, ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ చాలా కీలకం. అందులో కూడా ట్రైలర్ కు వచ్చే రెస్పాన్స్ ఆధారంగా వారం రోజులు థియేటర్లు నిండే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో 'OG' ట్రైలర్‌ను మాస్, క్లాస్ అందరికి కనెక్ట్ అయ్యేలా గ్రాండ్‌గా కట్ చేస్తున్నారట.

అమెరికాలో అయితే OG అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో వచ్చిన స్పందన చూస్తుంటే, ‘OG’ దసరా బరిలో పెద్ద సినిమాగా నిలవబోతుంది.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

స్టార్ కాస్టింగ్ & టెక్నికల్ టీం

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ ఎమ్రాన్ హష్మి కనిపించనున్నాడు. అదేవిధంగా ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు సుజీత్ ఓ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడని సమాచారం. సంగీతాన్ని థమన్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి తీసుకుంటున్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

రిలీజ్ డేట్ ఫిక్స్.. 

ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దసరా సీజన్‌లో విడుదలవుతున్న OG, తెలుగు సినీ పరిశ్రమలో మరో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.

OG సినిమా మీద అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మెల్‌బోర్న్ ఐమ్యాక్స్‌లో టికెట్లు నిమిషాల్లో సేల్ అవుట్ కావడం, అమెరికాలో బుకింగ్స్ శరవేగంగా జరగడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 

Advertisment
తాజా కథనాలు