మహా కుంభమేళాలో ఓదెలా 2 టీజర్ రిలీజ్.. అమాంతం పెరిగిన అంచనాలు

తమన్నా భాటియా మెయిన్ లీడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఓదెలా 2. ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం తాజాగా మహా కుంభమేళాలో రిలీజ్ చేసింది. టీజర్‌లో తమన్నా పవర్‌ఫుల్ లుక్‌లో ఉండటంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి

New Update

తమన్నా భాటియా మెయిన్ లీడ్‌లో నటిస్తు్న్న ఓదెలా 2 టీజర్‌ను మూవీ టీం తాజాగా విడుదల చేసింది. అశోక్ తేజ దర్శకత్వంతో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను మూవీ టీం మహా కుంభమేళాలో రిలీజ్ చేసింది. కుంభమేళాలో లాంఛ్ అయిన మొదటి టీజర్ కూడా ఇదే. అయితే కరోనా సమయంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌ మూవీకి సీక్వెల్‌గా ఓదెల 2 రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపిస్తోంది. 

ఇది కూడా చూడండి:  Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

టీజర్‌తో పెరిగిన అంచనాలు..

టీజర్ లాంఛ్ సందర్భంగా తమన్నా భాటియా మహా కుంభమేళాకు వెళ్లారు. అక్కడే సినిమా టీజర్‌ను లాంఛ్ చేశారు. మొత్తం మూవీ టీం కూడా అక్కడే ఉన్నారు. అయితే నాగ సాధువు లుక్‌లో తమన్నా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. టీజర్‌ను చూస్తుంటే సినిమా హిట్ కావడం పక్కా అనిపిస్తోంది. ఈ టీజర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మార్చి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు