NTR Dadasaheb Phalke Look: దాదాసాహెబ్ ఫాల్కే లుక్ లో వైరలవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు చూశారా..?

జూనియర్ ఎన్టీఆర్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ‘Made In India’లో నటించనున్నట్టు ప్రకటించారు. రజమౌళి సమర్పకుడిగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ లోని ఎన్టీఆర్ AI లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారత సినీ పుట్టుక ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.

New Update
NTR Dadasaheb Phalke Look

NTR Dadasaheb Phalke Look

NTR Dadasaheb Phalke Look: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ విభిన్నమైన పాత్రకు సిద్ధమవుతున్నాడు. భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో(Dadasaheb Phalke Biopic) ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌.ఎస్‌.రజమౌళి(SS Rajamouli) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

రజమౌళి సోషల్ మీడియాలో తన భావాలను పంచుకుంటూ, “ఈ కథనాన్ని తొలిసారి విన్నప్పుడే ఇది నా మనసును తాకింది. బయోపిక్ తీయడం అంత సులభం కాదు. పైగా భారత సినీ పితామహుడి కథను తెరపై చూపించడం మరింత కష్టమైన పని. అయినా, మా టీమ్ ఇందుకోసం పూర్తిగా సిద్ధమైంది” అని పేర్కొన్నారు.

Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

ఈ సినిమా పేరు ‘Made In India’, ఇది కేవలం ఒక వ్యక్తి బయోపిక్ మాత్రమే కాకుండా, భారతీయ సినిమా పుట్టుక నుంచి అన్ని అంశాలను కూడా కవర్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను వరుణ్ గుప్తా (Max Studios), ఎస్‌.ఎస్‌.కార్తికేయ (Showing Business) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయడం, ఇతర ప్రీ-ప్రొడక్షన్ వంటి  పనులు వేగంగా సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన AI జనరేటెడ్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాసాహెబ్ ఫాల్కే గెటప్‌లో ఖాదీ కుర్తా, మీసాలు, గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్స్‌కి విశేష స్పందన లభిస్తోంది. ఈ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఇక ఎన్టీఆర్ చివరిసారిగా ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కనిపించాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా దేవర: పార్ట్ 2 ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది, 2026 నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుంటున్న ‘Made In India’ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. యాక్షన్ కథలకి భిన్నంగా ఉండే ఈ సినిమా, ప్రేక్షకులకు విభిన్నమైన అనుభవాన్ని అందించనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు