/rtv/media/media_files/2025/05/03/9WxwqNW4xnQsoe544sTb.jpg)
nani hit 3 making video
నాని నటించిన ‘హిట్ 3’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దుమ్ము దులిపేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను దర్శకుడు శైలేష్ కొలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో నాని పవర్‌ఫుల్ యాక్షన్ సీన్ల షూటింగ్ విజువల్స్ ఉన్నాయి.
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు ఫ్రాంచైజీలు అదిరిపోయే రెస్పాన్స్‌తో మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటించాడు. ఈ సినిమాపై మొదటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి అంచనాలతో ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం రచ్చ రంబోలా చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
ఇందులో నాని మాస్ అండ్ పవర్ ఫుల్ యాక్టింగ్‌కు సినీ ప్రియులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా అదిరిపోయింది. దర్శకుడు శైలేష్ కొలను తన మార్క్ డైరెక్షన్‌తో సినిమా రేంజ్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్ల పరంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
హెడీ ప్రింట్ లీక్
ఇదిలా ఉంటే ఈ సినిమా పైరసీ భూతానికి బలైంది. మే1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హిట్3'.. విడుదలై 24 గంటలు గడవకముందే ఫుల్ హెడీ ప్రింట్ లీకైంది. 4xBet, ibomma, మూవీ రూల్స్ వంటి పైరసీ వెబ్ సైట్లలో ఒరిజినల్ ఆడియోతో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
hit 3 | nani