/rtv/media/media_files/2025/10/11/narne-nithin-wedding-2025-10-11-18-31-05.jpg)
narne nithin wedding
జూనియర్ ఎన్టీఆర్(junior-ntr) బావమరిది హీరో నార్నె నితిన్(Narne Nithin wedding) ఓ ఇంటివాడయ్యాడు. నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నితిన్- శివాని వివాహ వేడుక ఘనంగా జరిగింది. గతేడాది నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకల్లో ఎన్టీఆర్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తారక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకొని బావమరిది పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఎన్టీఆర్- ప్రణతీ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయారు. తారక్ క్రీమ్ కలర్ కుర్తా ధరించగా.. ప్రణతీ కూడా క్రీమ్ కలర్ శారీ విత్ డైమండ్ జ్యువెలరీలో మెరిసిపోయింది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సినీ తారలు కూడా హాజరై సందడి చేశారు.
#Venkatesh, #NagaChaitanya, #RanaDaggubati, #NandamuriKalyanram and #JrNTR at #NarneNithiin and Lakshmi Shivani's wedding. pic.twitter.com/iUPnpRJA6K
— Gulte (@GulteOfficial) October 10, 2025
Also Read : వీడు మగడ్రా బుజ్జి.. ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ పండగ
దగ్గుబాటి కుటుంబంతో బంధుత్వం
అయితే ఈ పెళ్లిలో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడం అందరీ దృష్టిని ఆకర్షించింది. వెంకటేష్ దంపతులు, సురేష్ బాబు దంపతులు, నాగ చైతన్య తల్లి లక్ష్మీ, రానా- మిహీక దంపతులు ఇలా దగ్గుబాటి కుటుంబం అంతా నితిన్- శివానీ పెళ్ళిలో సందడి చేశారు. దీంతో పెళ్లి కూతురికి దగ్గుబాటి కుటుంబంతో ఏదైనా బంధుత్వం ఉందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది నిజమేనని తెలుస్తోంది. దివంగత రామానాయుడికి వధువు శివానీ మనవరాలి వరుస అవుతుందట. అంటే వెంకటేష్, సురేష్ బాబుకు కూతురు వరుస అవుతుంది. అలాగే హీరో రానాకు చెల్లి అవుతుంది. పెళ్లి కూతురు లక్ష్మీ శివాని తండ్రి కృష్ణప్రసాద్ పుట్టింది నెల్లూరులో. కానీ, ఆయన వ్యాపార రిత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. దీంతో శివానీ చదువు, పెరగడం అంతా హైదరాబాద్ లోనే జరిగింది.
Follow Us