/rtv/media/media_files/2024/10/25/I4tDK2KAS2EpMRnVpC0A.jpg)
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఈ ఒక్క కేసు ఆయన కెరీర్ ను పూర్తిగా డౌన్ చేసేసింది. అయితే ఈ కేసులో ఆయన కోర్టుకు బెయిల్ కోరారు. అయితే కోర్టు మొదట ఆయన బెయిల్ ను రద్దు చేసింది. దాంతో జానీ మాస్టర్ హైకోర్టులో అప్పీల్ చేశారు.
ఆయన పిటిషన్ ను పరిశీలించిన హై కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కు అలా బెయిల్ వచ్చిందో లేదో..అయన సోషల మీడియా అకౌంట్ నుంచి ఓ షాకింగ్ పోస్ట్ కనిపించింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ జైలుకు వెళ్ళకముందు కొన్ని సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేశారు. అందులో బాలీవుడ్ మూవీ 'భూల్ భులాయ్యా 3' కూడా ఒకటి.
Also Read: 'లవ్ రెడ్డి' సినిమా నటుడిపై ప్రేక్షకురాలి దాడి.. బండబూతులు తిడుతూ
Thank you for the Trending response to my #SpookySlide ft. @TheAaryanKartik in #BhoolBhulaiyaa3TitleTrack 💥 https://t.co/4PDHe506Em#BhoolBhulaiyaa3@pitbull@diljitdosanjh@neerajvikings@tanishkbagchi@ipritamofficial@SameerAnjaan#DhrruvYogi#EricPillai@BazmeeAnees… pic.twitter.com/HuB4ctj3bO
— Jani Master (@AlwaysJani) October 24, 2024
Also Read : రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ : నాగవంశీ
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..
ఈ మూవీ టైటిల్ ట్రాక్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. 'హరే రామ్.. హరే రామ్' అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంది. తాజాగా ఈ సాంగ్ రికార్డులు సృష్టించడంతో జానీ మాస్టర్ తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
అంతేకాక ‘నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొస్తూ ‘భూల్ భులయ్యా3’ టీమ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read : వామ్మో.. 'పుష్ప 2' ను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా?
Also Read: పని వారిని కూడా సొంత వారిగానే...ఆస్తులు రాసిన టాటా!