/rtv/media/media_files/2025/05/31/HOP9arf2k4mcyomalerj.jpg)
NAGARJUNA AS SOUTH INDIAN RICHEST HERO
Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున దేశంలోనే అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్‌లను బీట్ చేసి ముందు స్థానానికి వెళ్లిపోయారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. నాగార్జున ఆస్తులు దాదాపు ₹3572 కోట్లు ($410 మిలియన్) అని అంచనా వేయబడ్డాయి.
/rtv/media/media_files/2025/05/31/9Nf0XqvS8XDtrBZx07W5.png)
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!
బాలీవుడ్ స్టార్లను మించి..
అమితాబ్ బచ్చన్ రూ.3,200 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.2,900 కోట్లు, హృతిక్ రోషన్ 3,100 కోట్లు, ఆమిర్ ఖాన్ రూ.1,900 కోట్లు ఇలా బాలీవుడ్ స్టార్లను సైతం అధిగమించి టాప్ లో నిలిచారు కింగ్. నాగార్జున సినిమాలతో పాటు బిజినెస్, రియల్ ఎస్టేట్, స్టూడియోలు, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఇలా విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇలా వ్యాపారాలు, ప్రాపర్టీ ద్వారా సంపద పెంచుకున్నారు.
/rtv/media/media_files/2025/05/31/5str3Yt6EQgIdu5HiX1o.png)
Also Read : యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
నాగార్జున ముఖ్యమైన ఆస్తులు
అన్నపూర్ణ స్టూడియోస్, N3 Realty Enterprises (రియల్ ఎస్టేట్ కంపెనీ), 3 స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు, ప్రైవేట్ జెట్, డజన్ కి పైగా లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు కేవలం ఆయన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువే రూ.900 కోట్లుగా దైనిక్ భాస్కర్ నివేదిక చెబుతోంది.
/rtv/media/media_files/2025/05/31/tvGD7y84kXX17Ga2piXp.png)
ఇతర దక్షిణాది స్టార్‌ల సంపద
పలు నివేదికల ప్రకారం.. చిరంజీవి నికర ఆస్తుల విలువల ₹1650 కోట్లు, రామ్ చరణ్ ₹1370 కోట్లు, కమల్ హాసన్ ₹600 కోట్లు, రజనీకాంత్ ₹500 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ ₹500 కోట్లు, ప్రభాస్ ₹250 కోట్లు ఇలా సౌత్ స్టార్లు కూడా నాగార్జున వెనకే ఉన్నారు.
Also Read: Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే
Latest News | richest-actors
Follow Us