Sandeep Reddy Vanga: అయ్యో వంగ.. అప్పుడు దీపిక .. ఇప్పుడు అల్లు అర్జున్ ఔట్!

అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం.. వంగా ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ ని సైడ్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
allu arjun removed form sandeep vanga film

allu arjun removed form sandeep vanga film

Sandeep Reddy Vanga:  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో సారి వార్తల్లో నిలిచాడు.  అయితే అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ సినిమా రాబోతుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి అల్లు అర్జున్ కూడా ఒకే చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించడం లేదని తెలుస్తోంది. వంగా ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ స్థానంలో  జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా కథ రాసేటప్పుడు వంగా..  బన్నీని అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఈ స్టోరీకి ఎన్టీఆర్ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించారట. అందుకే అల్లు అర్జున్ ని సైడ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: Cinema: హీరో నిఖిల్ సినిమాలో భారీ ప్రమాదం

Also Read :  టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

ఇటీవలే దీపిక

ఇటీవలే కొన్ని విభేదాలతో  వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' నుంచి దీపికా సైడ్ అవడం.. ఇది జరిగిన కొన్ని వారాలకే అల్లు అర్జున్ తో వంగా సినిమా క్యాన్సిల్ అవడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే దీపికా పదుకొనే..  రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్, లాభాల్లో వాటా గురించి కొన్ని డిమాండ్లు పెట్టడం వల్ల  సందీప్ తో విభేదాలు వచ్చాయని సమాచారం. అంతేకాదు వంగా కూడా సోషల్ మీడియాలో దీపికను పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. "డర్టీ పీఆర్ గేమ్స్" ఆడుతోందని, నమ్మకాన్ని పాడుచేసిందని ఆరోపించారు. దీపికా స్థానంలో  'యానిమల్' బ్యూటీ త్రిప్తిని కాస్ట్ చేస్తున్నారట డైరెక్టర్ వంగా. 

Also Read :  ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

సందీప్ వంగా సినిమాల నుంచి తప్పుకున్న అల్లు అర్జున్- దీపికా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న   "AA22xA6"  కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. 

Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్‌ బర్త్‌డే స్పెషల్‌.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్

 

Latest News | Deepika Padukone-Sandeep Reddy Vanga

Advertisment
Advertisment
తాజా కథనాలు