/rtv/media/media_files/2025/02/02/zB1sgFFGevdrcg4ROgLJ.jpg)
naga chaitanya and sai pallavi thandel movie pre release event today public not allowed
అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ2’ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పకులుగా.. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
ఫిబ్రవరి 7న రిలీజ్
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్, అండ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఏర్పాటు చేశారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నేడు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హాజరు కానున్నారు. దీంతో ఈ ఇద్దరు స్టార్లను ఒకే వేదికపై చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రకటనతో అంతా చల్లబడ్డారు.
మూవీ టీం కీలక ప్రకటన
ఇంతకీ మూవీ టీం ఏమని ప్రకటించిందంటే..? ఇవాళ జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పబ్లిక్ కు ఎలాంటి అనుమతి లేదని తెలిపింది. కేవలం ప్రసార మాధ్యమాల వేదికగా మాత్రమే ఈ ఈవెంట్ ను వీక్షించాలని కోరింది. ఈ మేరకు కొన్ని అనివార్య కారణాల రీత్యా దురదృష్టవశాత్తు.. ‘ఐకానిక్ తండేల్ జాతరను’ మూవీ యూనిట్ సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్
దీనికి పబ్లిక్ కు ఎంట్రీ లేదని పేర్కొన్నారు. లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పారు. దీంతో సినీ ప్రియులు, అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అల్లు అర్జున్ ను- సందీప్ రెడ్డి వంగాను ఒకే స్టేజ్ పై చూడాలనుకున్నామని.. అయితే ఇప్పుడు అది వీలు పడటం లేదని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.