/rtv/media/media_files/2025/02/18/lwg1T2oHqaEtVqwbuTwC.jpg)
AP New VCs Appointment
AP New VCs Appointment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైన్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సీఎస్ఆర్కే ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రసాద్ వరంగల్ లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్.
— greatandhra (@greatandhranews) February 18, 2025
ఆంధ్రా వర్సిటీ - జీపీ రాజశేఖర్,
రాయలసీమ వర్సిటీ - వెంకట బసవరావు, పద్మావతి మహిళా వర్సిటీ - ఉమ,
కృష్ణా వర్సిటీ - కే రాంజీ,
అనంతపురం JNTU - సుదర్శనరావు,
కాకినాడ JNTU - CSRK ప్రసాద్,… pic.twitter.com/n1y5MzO4Uf
Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా రాజశేఖర్..
ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ను నియమించారు గవర్నర్. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మాథ్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమించారు. ప్రకాశ్ బాబు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్‌లో బయో టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నియామకం రానున్న మూడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.