Mohan Babu: ‘మై కన్నప్ప స్టోరీ’.. మోహన్‌బాబు స్పెషల్ వీడియో

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మంచు మోహన్ బాబు స్పెషల్ వీడియో షేర్ చేశారు. ‘మై కన్నప్ప స్టోరీ’ అంటూ తన తల్లి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
mohan babu shared special video

mohan babu shared special video

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మంచు విష్ణు (Manchu Vishnu) 'కన్నప్ప' ఒకటి. ఈ చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇందులో మంచు విష్ణు తండ్రి మంచు మోహన్‌బాబు సైతం కీలక పాత్ర పోషించారు. 

ఇది కూడా చూడండి:Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

‘మై కన్నప్ప స్టోరీ’

అన్ని పనుల పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల అంటే జూన్ 27న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి మోహన్‌బాబు తాజాగా ఒక ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. ‘మై కన్నప్ప స్టోరీ’ అంటూ తన తల్లి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి:Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

ఇకపోతే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ పాన్-ఇండియా సినిమాలో ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ హిరోస్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనుండడం అంచనాలు మరింత పెరిగిపోయాయి. 

ఇది కూడా చూడండి:Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

ఈ మెగాప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు చిత్ర నిర్మాత, హీరో విష్ణు మంచు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన గ్లోబల్ ప్రమోషన్ టూర్‌ను కూడా పూర్తి చేశాడు.  'కన్నప్ప' చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ కు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మంచు విష్ణు అండ్ టీమ్ చాలా పకడ్బందీగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు.

Advertisment