మంచు ఫ్యామిలీ గొడవల్లో భాగంగా మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్ పై దాడి చేయడం ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దాడిలో రిపోర్టర్ కి మూడుచోట్ల జైగోమాటిక్ ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. కంటికి, చెవికి మధ్య ఫ్రాక్చర్ కావడంతో 3 గంటలపాటు సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం కాగా మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ దాడి ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. ఆ తర్వాత తాను ఎక్కడికి పారిపోలేదని ఓ ఆడియో రిలీజ్ చేశారు. Also Read : 2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే? యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌కు పరామర్శరంజిత్, కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పిన మోహన్‌బాబు https://t.co/j9nYabScrq pic.twitter.com/pEDq0onORb — Telugu Scribe (@TeluguScribe) December 15, 2024 Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? మోహన్ బాబు బహిరంగ క్షమాపణ.. ఇదిలా ఉంటే ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ ను మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతోనే ఉన్నారు. Also Read: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!