/rtv/media/media_files/2025/03/14/V0BNv1FthmbVaGVZ3Vd6.jpg)
Megastar Chiranjeevi responds to Nagababu MLC
ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇందులో 5గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో జనసేన తరఫున కొణిదెల నాగబాబు ఉన్నారు. ఆయన ఎన్నికపై ఇప్పటికే పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎట్టకేలకు నాగబాబు ఎమ్మెల్సీ పై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికయి ఏపీ శాసనమండలిలో అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా సమస్యల మీద గళం విప్పాలని అన్నారు. వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడాలని.. ఆ కృషిలో విజయం సాధించాలని అన్నారు. వారి అభిమానాన్ని మరింత పొందాలని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read : ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు @NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని…
వర్మపై నాగబాబు కామెంట్స్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో భారీగా ‘జయకేతనం’ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్లు చేశారు.
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
పవన్ గెలవడానికి రెండు కారణాలు
ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని అన్నారు. పిఠాపురంలో పవన్ గెలవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అన్నారు. అందులో మొదటి కారణం పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆ తర్వాత రెండో కారణం జనసైనికులు, కార్యకర్తలు అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
ఈ రెండు కారణాల వల్లే పవన్ విజయం సాధించారు అని తెలిపారు. దీంతో పవన్ గెలుపులో వర్మ పాత్ర లేదని నాగబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాగా 2024 ఎలక్షన్లలో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. తన మద్దతు వల్ల పవన్ గెలిచాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటికి కౌంటర్‌గానే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో.