/rtv/media/media_files/2025/01/29/0m5YZEECK3kAC5q2riF6.jpg)
chiru Photograph: (chiru)
Chiru: మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
జన్మదిన శుభాకాంక్షలు అంజనా దేవి గారు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండు అమ్మ ❤❤😍🙏🙏 pic.twitter.com/m3VeSjWd9B
— Kalyan Babu™ (@ram_aduri) January 29, 2025
ఉపాసన స్పెషల్ పోస్ట్..
ఇక మెగా ఉపాసన తన ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె.. 'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ముఖంలో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్ అవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి' అంటూ పొగిడేసింది.