Cricket: రెండో వన్డే, సీరీస్ కూడా భారత్ దే...

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డే లో కూడా భారత టీమ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో బ్రిటీష్ టీమ్ ను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 శతక్కొట్టి చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. 

New Update
cric

India won Second One day with England

మూడు వన్డేల సీరీస్ ను ఒక మ్యాచ్ మిగిలుండగానే టీమ్ ఇండియా  2-0తో  కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. దీన్ని టీమ్ ఇండియా  44.3 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను రీచ్ అయింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు బాది టీమ్ కు మరుపురాని విజయాన్నందించాడు. రోహిత్ కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ మాత్రం కోహ్లీ మళ్ళీ నిరాశపర్చాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శుభ్ మన్ గల్ 52 బంతుల్లో 60, శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 44 పరుగులు, అక్షర్ పటేల్ 43 బంతుల్లో 41 తో రాణించారు. కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్య (10), రవీంద్ర జడేజా (11*) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఒవర్టన్ 2, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టన్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకుని 35 పరుగులతో అద్భుతమైన స్పెల్ వేశాడు. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 12 అహ్మదాబాద్‌లో జరగనుంది.

కెప్టెన్ ఈజ్ బ్యాక్...

దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. గత కొంతకాలంగా మ్యాచుల్లో విఫలవుతూ వస్తున్న రోహిత్ శర్మ.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హిట్‌మ్యాన్‌ తన స్టైల్లో థండర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు.ఆదిల్ రషీద్‌ వేసి 25.2 ఓవర్‌కు సిక్స్‌ కొట్టి సెంచరీ చేశాడు. వన్డే మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్స్‌ జాబితా కూడా రోహిత్‌ (337) రెండో ప్లేస్‌కు చేరుకున్నారు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌ గేల్‌(331)ను రోహిత్‌ వెనక్కి నెట్టాడు. ఇక వన్డేల్లో 351 సిక్స్‌లతో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (49) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ టెండుల్కర్‌ 100 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. విరాట్‌ కొహ్లీ 81 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు