Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ మరోసారి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మార్చ్ 28 రిలీజ్ అని నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. కానీ ఇదే డేట్ కి నితిన్ 'రాబిన్ హుడ్' మరుసటి రోజు 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తుండటంతో పవన్ సినిమా రావట్లేదని ప్రచారం సాగుతోంది.

New Update
pawan kalyan harihara veeramallu

pawan kalyan

పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. పీరియాడికల్ బ్రేక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి నాలుగేళ్లు కావస్తోంది. ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. మార్చ్ 28 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ రోజు కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. 

అంటే 'వీరమల్లు' రిలీజ్ మరోసారి  పోస్ట్ పోన్ కాబోతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఓ పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు మీడియా బడ్జెట్ సినిమాలు అదే రోజు రావడానికి సాహసం చేయవు. కానీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ నాడే నితిన్ 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు మార్చ్ 28, 29 అని నిన్న రిలీజ్ డేట్స్  అనౌన్స్ చేశాయి.అలాగే విజయ్ దేవరకొండ 'VD12' కూడా మార్చ్ 28 న రిలీజ్ చేస్తామని ఆ మధ్య నిర్మాత చెప్పారు.

ఇంత సడెన్ గా ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూస్తుంటే.. 'హరిహర వీరమల్లు' పోస్ట్ పోన్ అవ్వడంతోనే ఆ డేట్ ను ఈ రెండు సినిమాలు లాక్ చేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజామా? కాదా? అనేది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం మాత్రం 'హరిహర వీరమల్లు' పోస్ట్ పోన్ అయిందనే న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు