Meenakshi Chaudhary: ఆ స్టార్ క్రికెటర్ అంటే పిచ్చి: మీనాక్షి చౌదరి

మీనాక్షి చౌదరి తాజాగా తన ఐపీఎల్ ఫేవరేట్ టీమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని ఎక్కడ ఆడితే ఆ జట్టే తన ఫేవరెట్ అని చెప్పారు. కేవలం ధోని కోసమే తాను క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్నట్లు చెప్పుకొచ్చారు.

New Update

Meenakshi Chaudhary: పంజాబీ భామ మీనాక్షి చౌదరి ఒక్క గ్లామర్ లోనే కాదు, విద్య, స్పోర్ట్స్ లోనూ  బహుముఖ ప్రతిభాశాలి. తన వ్యక్తిగత జీవితంలో వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్‌గా అర్హత పొందిన ఈ బ్యూటీ, చదువు మాత్రమే కాకుండా స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌లోనూ మంచి క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందింది. అలాగే  అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచి, తన అందం, ఆత్మవిశ్వాసంతో అభిమానులను సంపాదించుకుంది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

మొదట బాలీవుడ్‌ మూవీతో నటనలోకి అడుగుపెట్టిన మీనాక్షి, తరువాత తెలుగు సినీ పరిశ్రమలోకి 2020లో "ఇచ్చట వాహనాలు నిలుపరాదు" అనే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అయితే "హిట్: ది సెకండ్ కేస్‌" చిత్రంతో అమ్మడుకి కెరీర్లో మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమెకు కోలీవుడ్‌ నుండి కూడా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విజయ్‌ ఆంటోనితో కలిసి "కొలై" చిత్రంలో నటించినా, అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ విజయ్‌ తలపతి తో నటించిన "గోట్‌" సినిమాలో ఆమె నటన అభిమానులను ఆకట్టుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ సరసన "లక్కీ భాస్కర్‌" అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అయితే బాలీవుడ్ లో "స్త్రీ", "మిమీ" వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దినేశ్‌ విజయన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రంలో మీనాక్షి కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ధోనీ ఫేవరెట్‌: మీనాక్షి చౌదరి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే మీనాక్షిని ఓ ఇంటర్వ్యూలో "ఐపీఎల్‌(IPL) జట్లలో మీకు నచ్చిన జట్టు ఏది?" అని అడిగితే, ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. తాను ప్రత్యేకంగా ఏ జట్టును ఫేవరెట్‌గా భావించనప్పటికీ, ఎంఎస్‌.ధోనిపై(M.S Dhoni) తనకు ప్రత్యేక అభిమానం ఉన్నదని చెప్పింది. ధోనీ ఎక్కడ ఆడితే ఆ జట్టే తనకు ఫేవరెట్‌ అని చెప్పిన మీనాక్షి, ధోని కోసమే తాను క్రికెట్‌ను ఆసక్తిగా చూడడం ప్రారంభించానని వెల్లడించారు. ఈ మాటలతో ధోని ఫ్యాన్స్ కు కూడా ఫేవరేట్ గా మారిపోయింది మీనాక్షి. 33 ఏళ్ల వయసులోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో అవకాశాలను సొంతం చేసుకుంటూ మల్టీ-ఇండస్ట్రీ యాక్ట్రెస్‌గా ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీనాక్షి చౌదరి కెరీర్ మరింత విజయవంతం కావాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు