MAZAKA: హీరోయిన్లకు అవి పెద్దగా ఉండాలి.. తెలుగు డైరెక్టర్ వల్గర్ కామెంట్స్!

హీరోయిన్లపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

New Update
Trinadha Rao Nakkina

MAZAKA Director Trinatha Rao vulgar comments on heroines

Tollywood: హీరోయిన్లపై టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మూవీ టీజర్ ఈవెంట్.. 

ఈ మేరకు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన 'మాజాకా' మూవీలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. గతంలో నాగార్జునతో మన్మధుడు సినిమాలో నటించిన అన్షు ఈ మూవీలో గెస్ట్ రోల్ పోషించింది.  ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ఆదివారం రీలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే టీజర్ వేడుకలో సినిమాను ఉద్దేశించి మాట్లాడిన త్రినాథరావు.. సినిమా కోసం అన్షు చాలా కష్టపడిందని, నిజంగా తాను నమ్మలేకపోతున్నానన్నాడు. 

ఇది కూడా చదవండి: Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

తెలుగు వాళ్లకు ఆ సైజ్ సరిపోదు.. 

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అన్షు అంబానీని ఉద్దేశిస్తూ వల్గర్ కామెంట్స్ చేశాడు. 'ఒకప్పుడు అన్షు అంబానీ చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. కొంచెం తిని బాగా పెంచమ్మా అని చెప్పాను. తెలుగు వాళ్లకు అవి సరిపోవు. అన్నీ పెద్దవిగా ఉండాలని చెప్పాను' అంటూ కాంట్రవర్సీగా కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి అతన్ని వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడవారి గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్న వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు