/rtv/media/media_files/2025/02/13/Vxl4XG5U4GRFmDYUq29a.jpg)
Marco OTT Release
Marco OTT: డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఉన్ని ముకుందన్ మూవీ "మార్కో" హనీఫ్ అదేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా సోనీ LIV OTT ప్లాట్‌ఫామ్‌లో FEB 14 నుండి నాలుగు భాషలలో రిలీజ్ అవుతోంది.
Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
OTTలో నో అన్‌కట్ వెర్షన్..
మార్కో నిర్మాతలు OTT ప్లాట్‌ఫామ్‌లో అన్‌కట్ వెర్షన్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య భారీ ప్రచారం జరిగింది. కానీ చివరికి, థియేట్రికల్ వెర్షన్ మాత్రమే విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొడక్షన్ హౌస్‌ను ట్యాగ్ చేస్తూ, అన్‌కట్ వెర్షన్‌ను OTTలో ఎందుకు విడుదల చేయడం లేదు అని ప్రశ్నించగా, దీనికి స్పందిస్తూ, నిర్మాణ సంస్థ, ప్రసార మంత్రిత్వ శాఖ లేవనెత్తిన వివిధ ఫిర్యాదుల కారణంగా, అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయడం సాధ్యం కావడంలేదు అని తెలిపింది.
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
"మార్కో" ఇండియాలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది, ఇందులో చూపించిన అత్యాశ, రక్తపాత సన్నివేశాలు, పిల్లలతో కూడిన హింసా దృశ్యాల వల్ల చాలా మంది థియేటర్లలో సినిమాను చూస్తూ స్పృహ కోల్పోయారు.
Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?
అయితే, మార్కో థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు OTT ప్రేక్షకుల నుండి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.