Manchu Manoj: ''శివయ్య.. అంటే శివుడు రాడు''.. అన్న విష్ణుపై.. మనోజ్ ట్రోలింగ్! వీడియో వైరల్

భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంచు మనోజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ''శివయ్య.. అంటే శివుడు రాడు అంటూ ఇండైరెక్ట్ గా అన్న విష్ణుపై సెటైర్లు వేశారు. అలాగే ఇటీవలే తన కుటుంబంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

New Update

Manchu Manoj:  విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రాబోతున్న  లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'భైరవం' ఈ నెల 30న  థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 

ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

9 ఏళ్ళు అయ్యింది..

ఈ సందర్భంగా మనోజ్ వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ''తెరపై కనిపించి 9 ఏళ్ళు అయ్యింది.. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ డైరెక్టర్ రుణం తీర్చుకోలేను. 9 ఏళ్ల నుంచి మీ అందరికీ దూరంగా ఉన్నాను. అయినప్పటికీ  నాపై   మీ ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. సొంతం వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొని నాకు ఇంత ప్రేమను పంచుతున్నారు అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు'' మనోజ్. 

ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

అన్న పై సెటైర్లు.. 

అయితే ఈ క్రమంలో అన్న విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఇండైరెక్ట్ గా  చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివుడిని  ''శివయ్య''...  అంటే రాడు.. మనసారా తలుచుకుంటే .. ఇలా డైరెక్టర్ రూపంలోనో, ప్రొడ్యూసర్ రూపంలోనో, అభిమానుల రూపంలోనో వచ్చేవాడే శివుడు అని అన్నారు. శివయ్య.. అనే డైలాగ్ మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలోది. దీంతో మనోజ్ ఇండైరెక్ట్ గా  విష్ణుని ట్రోల్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

telugu-news | latest-news | cinema-news | manoj manchu | Manchu Vishnu 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు