/rtv/media/media_files/2025/10/18/daksha-2025-10-18-10-02-23.jpg)
Daksha
మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం 'దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ'. అయితే నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించిన మంచు లక్ష్మి మళ్లీ కొన్నేళ్ల తర్వాత వెండితెరపై కనిపించింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో మంచు లక్ష్మితో పాటు ఆమె తండ్రి మోహన్‌బాబు కూడా నటించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కాగా.. తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ థ్రిల్లర్ మూవీని చూడవచ్చని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి వెరీ పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో లక్ష్మి పోలీస్ ఆఫీసర్ దక్ష పాత్రలో నటించి మెప్పించారు. లక్ష్మి ఈ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమెతో పాటు సముద్ర ఖని, 'రంగస్థలం' మహేష్, యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, మలయాళ నటుడు సిద్ధిఖీ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మోహన్‌బాబు అతిథి పాత్రలో కనిపించారు.
OTT: The latest update reveals that #Daksha is now streaming on Prime Video in Telugu audio along with English subtitles. pic.twitter.com/x8uAS14XSf
— MOHIT_R.C (@Mohit_RC_91) October 18, 2025
ఇది కూడా చూడండి: Zaira Wasim Wedding: పెళ్లి చేసుకున్న మరో యంగ్ హీరోయిన్.. ఇన్ స్టాలో ఫొటోలు షేర్
హత్య వెనుక పెద్ద కుట్ర..
హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోవడంతో దక్ష (మంచు లక్ష్మి) ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. దీని తర్వాత అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా ఇలానే హత్యకు గురవుతారు. ఈ రెండు కేసుల్లో ఆధారాలు కూడా ఒకేలా ఉంటాయి. దీంతో ఈ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందని దక్ష అనుమానిస్తుంది. ఒక రకమైన గ్యాస్‌ను ఉపయోగించి దుండగులు హత్యకు పాల్పడుతారు. అయితే ఎవరు హత్య చేశారు? ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? ఆ కుట్ర వెనుక కారణాలు ఏంటి? దక్ష ఈ కేసును ఎలా ఛేదించింది? అనేది సినిమా స్టోరీ. ఈ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ స్పందన వచ్చింది. కథ మొత్తం సస్పెన్స్, మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచు లక్ష్మి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. అంతేకాకుండా మోహన్‌బాబు పాత్ర, ఆయన డైలాగ్ డెలివరీ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సముద్ర ఖని, సిద్ధిఖీ వంటి నటులు తమ అద్భుతమైన నటనతో కథకు బలాన్నిచ్చారు. దర్శకుడు క్లిష్టమైన కాన్సెప్ట్‌ను తీసుకున్నప్పటికీ, దాన్ని స్పష్టమైన కథనంతో (క్లీన్ నేరేషన్) తెరకెక్కించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ పొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.
ఇది కూడా చూడండి: K Ramp Twitter Review: 'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ.. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కిరణ్ అబ్బవరం ఒకటే ర్యాంపేజ్!