K Ramp Twitter Review: 'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ.. కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కిరణ్ అబ్బవరం ఒకటే ర్యాంపేజ్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్' నేడు థియేటర్లలోకి రిలీజైంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

New Update
Kiran Abbavaram

Kiran Abbavaram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'కె ర్యాంప్' నేడు థియేటర్లలోకి రిలీజైంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది 'క' చిత్రంతో హిట్ అందుకున్న కిరణ్.. ఈ దీపావళికి మరో విజయాన్ని అందుకుంటాడా? మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Jatadhara : ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు..  జటాధర ట్రైలర్‌ అదుర్స్!

కొన్ని సీన్లు ఉన్నాయని..

కిరణ్ అబ్బవరం తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆశించిన స్థాయిలో కామెడీ లేదని, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. సినిమా మొత్తం ఇతని చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల కిరణ్ వన్-లైన్ డైలాగులు బాగా నవ్వించాయి. అయితే సినిమా కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉందని అంటున్నారు. గతంలో అనేక చిత్రాల్లో చూసిన పాత ఫార్ములానే మళ్లీ ఈ సినిమాలో వాడరని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు అయితే చాలా బోరింగ్‌గా అనిపించాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథ మొత్తం కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరో గాలికి తిరిగే కుర్రాడిగా కనిపిస్తాడు. ఈ క్రమంలో కాలేజీ సన్నివేశాలు, హీరోయిన్‌తో లవ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి పెద్దగా పండలేదు.

దర్శకుడు ఎంచుకున్న రొటీన్ కథను కూడా ఆసక్తికరంగా నడిపించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. చాలా మంది ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్ పెద్దగా నచ్చలేదు. ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించింది. హీరోయిన్‌కు ఒక డిజార్డర్ ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. అలాగే తండ్రీకొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా నటుడు నరేష్‌కి సంబంధించిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి.మరికొందరు కామెడీ బాగుందని, వన్ మ్యాన్ షో అని అంటున్నారు. ఓవరాల్‌గా 'కె ర్యాంప్' సినిమా కిరణ్ అబ్బవరం నుంచి ఆశించిన పెద్ద విజయాన్ని అందించలేకపోయిందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Zaira Wasim Wedding: పెళ్లి చేసుకున్న మరో యంగ్ హీరోయిన్.. ఇన్ స్టాలో ఫొటోలు షేర్

Advertisment
తాజా కథనాలు