/rtv/media/media_files/2025/10/18/zaira-wasim-wedding-2025-10-18-07-56-02.jpg)
Zaira Wasim Wedding
'దంగల్' సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటి జైరా వసీం (Zaira Wasim) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ నటి తన నిఖా (వివాహం) వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Zaira Wasim Wedding
చాలా సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ను విడిచిపెట్టి, సినిమాలకు దూరంగా ఉంటున్న జైరా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో ఒకటి ఆమె తన నిఖానామా (వివాహ ధృవీకరణ పత్రం) పై సంతకం చేస్తున్నట్లు చూపిస్తుంది. మరొకటి ఆమె తన భర్తతో చంద్రుడిని చూస్తున్నట్లు చూపిస్తుంది. ఈ రెండు ఫోటోలలోనూ ఆమె తన భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఈ ఫోటోలకు జైరా "ఖుబూల్ హై x3" (Qubool hai x3) అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది ఇస్లామిక్ వివాహ సంప్రదాయంలో నిఖా ఖరారు అయినట్లు చెప్పడానికి వాడే పదం.
తన పెళ్లి రోజున జైరా రెడ్ కలర్ లెహంగా, గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. అదే సమయంలో ఆమె భర్త ఆఫ్-వైట్ కలర్ డ్రెస్ ధరించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు జైరాకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆమె ప్రైవేటు జీవితాన్ని గౌరవిస్తూ అభినందనలు తెలియజేయగా, మరికొందరు ఆమె భర్త గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపారు.
#InPics | Dangal actor Zaira Wasim has married, announcing her union on Instagram. She wore a vibrant red wedding outfit with gold embroidery.
— Hindustan Times (@htTweets) October 18, 2025
Swipe 👈 to see
More details 🔗 https://t.co/OwDQDhXXkrpic.twitter.com/bKcryyLNa0
2016లో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రంలో చిన్ననాటి గీతా ఫోగట్ పాత్రతో జైరా వసీం సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమిర్‌తో కలిసి "సీక్రెట్ సూపర్‌స్టార్" చిత్రంలో కూడా పనిచేసింది. ఆ తర్వాత ఆమె ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన "ది స్కై ఈజ్ పింక్"లో కనిపించింది. తన నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మత విశ్వాసాలకు అనుగుణంగా జీవించడానికి నటనకు దూరమవుతున్నట్లు జూన్ 2019లో తాను నటనను వదిలివేస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తన కొత్త జీవితాన్ని ప్రారంభించిన జైరాకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.