విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ

పోలీసుల విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి ఈ రోజు హాజరయ్యారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ రెడ్డికి ఇటీవల పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కడప పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. 

New Update
MP Avinash: వివేకా హత్య.. చీకటి ఒప్పందంతోనే అలా జరిగింది..అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి ఈ రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల రాఘవ రెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు అతను విచారణకు హాజరయ్యారు. రాఘవరెడ్డి వర్రా రవీందర్‌రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే అతనికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

అసభ్యకరమైన పోస్టులు చేశారని..

వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల ఇలా విపక్ష నేతలపై వైసీపీ వారు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పులివెందుల్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి కూడా నోటీసులు పంపారు. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఇదిలా ఉండగా ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ పీఏతో పాటు అతని అనుచరులు మొత్తం 11 మందిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు విజయవాడ, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన ఇంకొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ విషయన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

Advertisment
తాజా కథనాలు