SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కన్ఫామ్

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బీ 29 సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇందులో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు. మహేశ్ బాబు, పృథ్వీ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ విషయం కన్ఫామ్ అయింది. 

New Update
cinema

Mahesh babu, Prithvi raj Sukumaran

రాజమౌళీ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఎస్ఎస్ ఎమ్బీ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన విషయాలు ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మహేశ్ బాబు తప్పితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది రాజమౌళి అనౌన్స్ చేయలేదు. అయితే ఇందులో యాక్ట్ చేస్తున్న నటులు ఫోటోలు బయటకు రావడం, లేదా వారే ఫోటోలు పెట్టడం ద్వారా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి అలాగే బయటకు వచ్చింది.  ఆమె హైదరాబాద్ వచ్చినప్పటి ఫోటోలు, సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా ఈ సినిమాలో ప్రియాంక నటిస్తున్న విషయం తెలిసింది. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న ఎస్ఎస్ఎమ్బీ టీమ్ ఇప్పుడు బయట లొకేషన్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. వీళ్ళందరూ ఒరిస్సా వెళ్ళినట్టు సమాచారం. 

మలయాళ నటుడు ఉన్నాడు..

తాజాగా మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా మహేశ్, రాజమౌళీ టీమ్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. రీసెంట్ గా స్వయంగా ఆయనే ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇండైరెక్ట్ గా తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈరోజు మహేశ్ బాబు, పృథ్వీ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీళ్ళిద్దరూ పోలీసులతో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. రేపటి నుంచి ఎస్ఎస్ఎమ్బీ షూటింగ్ ఒడిశాలో జరగనుంది. ఇందులో జాయిన్ అయ్యేందుకు మహేశ్, పృథ్వీ వెళ్ళారని..అప్పుడు అక్కడ ఒడిశా పోలీసులతో మీట్ అయినప్పుడు ఫోటోలను చెబుతున్నారు. దీంతో మలయాళ నటుడు రాజమౌళి సినిమాలో ఉన్నారనే విషయాన్ని కన్ఫామ్ చేసేస్తున్నారు సినీ ప్రియులు. 

అటవీ నేపథ్యంలో సాగే కౌబాయ్ సినిమాను తీస్తున్నారు రాజమౌళి. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. అందుకే వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎమ్బీ అని ప్రస్తుతానికి పిలుస్తున్నారు. ఇదొక సాహసగాధగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో మహేశ్‌ మునుపెన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా ఉన్నారు. 

Also Read: Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు