Kiran Bedi: చిరంజీవికి కిరణ్‌ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. కూతుళ్లు కూడా వారసులే అంటూ!

మగపిల్లలే వారసులని చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ కిర‌ణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూతుళ్లు కూడా వారసురాలేనని నమ్మండి. వారు ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి. ప్రయోజకులై కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లలను చూసి నేర్చుకోండి అన్నారు.

New Update
kiran chiru

Kiran Bedi strong counter to Chiranjeevi

Kiran Bedi: మగపిల్లలే వారసులంటూ ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు చేసిన వ్యాఖ్యలకు మాజీ ఐపీఎస్ కిర‌ణ్ బేడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూతుళ్లు కూడా వార‌సులేన‌ని, ఈ విష‌యాన్ని బలంగా న‌మ్మడంతోపాటు గుర్తించాలని సూచించారు. ఈ మేర‌కు ఎక్స్‌ వేదిక‌గా ఓ పోస్టు పెట్టిన కిర‌ణ్ బేడీ.. ‘చిరంజీవి ఆడ బిడ్డలు కూడా వారసురాలేనని నమ్మండి. వారు ఏ విషయంలోనూ తక్కువ కాదని గ్రహించండి. అయితే కూతురిని ఎలా పెంచుతున్నాం. ఎలా సపోర్ట్ చేస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అమ్మాయిలను పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను చూసి నేర్చుకోండి. వారుకూడా కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. చాలా మంది ఈ విష‌యాన్ని నిరూపించారు. ఆడపిల్లలు ఎందులోనూ త‌క్కువ కాదు' అంటూ తనదైన స్టైల్ లో చురకలంటించారు. ప్రస్తుతం కిర‌ణ్ బేడీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

లేడీస్ హాస్టల్ వార్డెన్..

ఇక ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకలో వారసత్వంపై చిరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బ్రహ్మానందం వారసత్వంపై మాట్లాడిన ఆయన.. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలన్నాడు. ఇందుకు రామ్ చరణ్ ను త్వరగా ఒక కొడుకును కని ఇవ్వాలని కోరారు.  ‘నేను ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది. చ‌ర‌ణ్ ఇప్పటికైన ఒక అబ్బాయిని క‌ని ఇవ్వు. నా వారసత్వం కొనసాగాలంటే మ‌నువ‌డు కావాలి. కానీ చ‌ర‌ణ్‌కి మ‌ళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉంది’ అన్నాడు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు