Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!

సింగర్ మికా సింగ్ హీరోయిన్ బిపాసా దంపతులపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవుడు ఉన్నాడు.. మనం చేసే పనులన్నీ చూస్తుంటాడు. నిర్మాతగా నాడు వాళ్ళు నాకు చేసిన నష్ఠానికి.. ఈరోజు దంపతులిద్దరికీ పని లేకుండా పోయింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

New Update
Mika Singh comments over  Bipasha Basu

Mika Singh comments over Bipasha Basu

Mika Singh:  ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన.. నటి బిపాసా బసు చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యారు. చివరిగా ఆమె 2020లో విడుదలైన 'డేంజరస్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు. ఈ క్రమంలో తాజాగా నటి బిపాసా దంపతుల పై  ప్రముఖ సింగర్ మికా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దేవుడు అన్నీ గమనిస్తాడు.. నాడు వాళ్ళు నాకు  చేసిన నష్ఠానికి.. ఈరోజు దంపతులిద్దరికీ పని లేకుండా పోయింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.  

Also read :  Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

మికా సింగ్ షాకింగ్ కామెంట్స్!

మికా సింగ్ మాట్లాడుతూ.. అప్పటివరకు మ్యూజిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాకు నిర్మాతగా మారాలనిపించింది. బిపాసా బసు, ఆమె భర్త , కరణ్‌ గ్రోవర్‌ జంటగా నటించిన  'డేంజరస్' వెబ్ సీరీస్ కి నిర్మాతగా వ్యవహరించాను. అయితే ఈ సీరీస్ చిత్రీకరణ కోసం రూ. 4 కోట్ల బడ్జెట్ పెట్టుకోగా.. బిపాసా దంపతుల కారణంగా  రూ.14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షూట్ కోసం లండన్ వెళ్లగా.. అక్కడ వారిద్దరూ చాలా నాటకాలు ఆడారు. ఒక రోజు ఆమెకు ఒంట్లో బాగోదు.. మరొకరోజు ఆయనకు  ఇలా చాలా రోజులపాటు షెడ్యూల్ అంతా వాయిదా పడుతూ వచ్చింది. వాళ్ళ ప్రవర్తన తో నిర్మాణ రంగంలోకి ఎందుకు వచ్చానా? అని బాధపడ్డాను. వీళ్ళు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇలాగే నిర్మతలు ఇబ్బంది పెడతారు. దేవుడు ఉన్నాడు.. మనం చేసే అన్ని పనులను చూస్తుంటాడు. నాడు వాళ్ళు నాకు  చేసిన నష్ఠానికి.. ఈరోజు దంపతులిద్దరికీ పని లేకుండా పోయింది అంటూ బిపాసా దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. 

Also Read: The Eye movie : రెచ్చిపోయిన శృతి హాసన్.. అతనితో కలిసి బెడ్‌పై ...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు