Pushpa 2: పుష్ప రాజ్ సక్సెస్ మీట్ .. మీడియా ముందుకు అల్లు అర్జున్!

అల్లు అర్జున్ 'పుష్ప2' రూ.1800 కోట్ల‌తో వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం నేడు సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నారు.

New Update
Pushpa thank you meet

Pushpa thank you meet

Pushpa 2:  సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన  'పుష్ప2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల‌కు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ. 2000 కోట్లు రాబట్టిన అమీర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన రెండవ భారతీయ చిత్రం 'పుష్ప 2'. 
అయితే ఈ సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం.. ఓ మహిళ చనిపోవడం పలు వివాదాలకు దారితీసింది. ఈ ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక ఈ ఘటన అనంతరం బన్నీ మీడియా ముందుకు రాలేదు. అంతే కాదు సినిమా సక్సెస్ కి సంబంధించి కూడా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. 

Also Read:Vishwaksen: మాది 'A' సెర్టిఫికెట్ ఫిల్మ్.. ఎందుకంటే? 'లైలా' పై విశ్వక్ కామెంట్స్

థాంక్యూ మీట్ 

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. నేడు సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నట్లు తెలిపారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. సంధ్యా ఘటన తర్వాత మొదటి సారి అల్లు అర్జున్ మీడియా ముందుకు రాబోతుండ‌డంతో.. ఆయన ఏం మాట్లాడతారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Also Read:Saif Ali khan Attack: సైఫ్ ను పొడిచింది వాడే.. పోలీసుల ముందే గుర్తు పట్టిన పని మనుషులు!

Also Read:SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్!

Advertisment
తాజా కథనాలు