/rtv/media/media_files/2025/05/26/y0xu8T02PE1chOTatoAx.jpg)
Kethika Sharma to play the heroine in Ravi Teja next new film
యంగ్ హీరోయిన్ కేతిక శర్మ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ కేతిక శర్మ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘రొమాంటిక్’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీతో జంటగా నటించింది. ఇందులో ఆకాష్‌తో కలిసి లిప్ లాక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
కేతిక శర్మకు గోల్డెన్ ఛాన్స్
ఇక ఇప్పుడిప్పుడే కేతిక వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తుంది. వచ్చిన అవకాశాలను బాగా వినియోగించుకుంటుంది. ఓ వైపు హీరోయిన్‌గా మరోవైపు ఐటెం సాంగ్‌లతో బిజీ బిజీ అయిపోయింది. ఇటీవల నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటతో రెచ్చిపోయింది. ఈ సాంగ్‌లో రొమాంటిక్ లుక్స్‌తో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
ఈ సాంగ్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో మరో సినిమా ఆఫర్ కొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ప్రస్తుతం రవితేజ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
దీని తర్వాత కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్‌లకు ఛాన్స్ ఉండగా.. అందులో కేతిక శర్మను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ketika sharma | latest-telugu-news | raviteja | telugu-news