కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే..బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతను దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. కొచ్చికి చెందిన ఇతన్నే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11 న గోవాలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం. By Anil Kumar 19 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ పెళ్లిపై రూమర్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ రూమర్స్ వచ్చాయి. ఓసారి బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని, ఇంకోసారి బాయ్ ఫ్రెండ్ అని అన్నారు. Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! కానీ వాళ్ళ పేరు, డీటైల్స్ లాంటివేం బయటికి రాలేదు. అయితే ఈసారి అలా కాదు.. కీర్తి సురేష్ పెళ్లి అని న్యూస్ వచ్చిందో లేదో ఇంతలోనే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి డీటెయిల్స్ తో పాటూ ఫొటో కూడా బయటికొచ్చింది. కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. Keerthy Suresh to marry her longtime Boyfriend this Dec 11 in GOA.#KeerthySuresh pic.twitter.com/6waWN75Eoj — Milagro Movies (@MilagroMovies) November 18, 2024 Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం! ఒకే స్కూల్ లో కలిసి.. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలోనే చదివినట్లు కథనాలు వస్తున్నాయి. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంటోని తట్టిల్ కీర్తి సురేశ్‌కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనని సమాచారం. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. Also Read : టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త #KeerthySuresh will get married to her longtime boyfriend Antony on December 12th! pic.twitter.com/GV4jEYacXe — Film Crazy (@filmcrazymedia) November 19, 2024 వెడ్డింగ్‌కు సంబంధించి కీర్తి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రెజెంట్ వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటూ ఈ ఏడాది బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్ సరసన 'బేబీ జాన్' అనే సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!? #tollywood #antony-thattil #marriage #keerthi-suresh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి