/rtv/media/media_files/2025/02/04/8YBbG1MByzwHMedRwECn.jpg)
ntr Photograph: (ntr)
Jr NTR: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అయితే తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో సజావుగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
పాదయాత్ర వంటివి చేయరాదు..
ఈ మేరకు అభిమానుల కోసం నిర్వహించబోయే కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకుంటానన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నా. ఈ నేపథ్యంలో అభిమానులు నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదు. ఫ్యాన్స్ ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానం అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రకటన వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
The Oscars. #Oscars95 pic.twitter.com/3njGGiQiP9
— Jr NTR (@tarak9999) March 12, 2023
ఇది కూడా చదవండి: Elon Musk: చాట్ జీపీటీది లెఫ్ట్ భావాజాలం: ఎలాన్ మస్క్