/rtv/media/media_files/2025/05/03/nFAgFLFAYZhKCOQQzgER.jpg)
Janulyri : ఫోక్ డ్యాన్సర్ జానులిరి వార్తల్లోకెక్కింది. యూట్యూబర్, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. వాటిపై పలు రకాల ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి.
Also Read : జానులిరి మరో షాకింగ్ వీడియో.. లవర్ దిలిప్ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే రియాక్షన్
వాటిపై జాను లిరి రీసెంట్‌గా స్పందించి ఏడ్చేసింది. ఆవేదనతో ఆమె ఒక వీడియోను పంచుకుంది. తనపై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని.. వాటిని తట్టుకోలేకపోతున్నానని పేర్కొంది. అంతేకాకుండా వాటిని చూస్తుంటే చనిపోవాలనిపిస్తుందంటూ వీడియోలో ఏడ్చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ క్రమంలో ఆమె లవర్ దిలీప్ దేవ్ గన్ షాకింగ్ వీడియో రిలీజ్ చేశాడు.
‘‘నేను రీసెంట్‌గా పోస్టు చేసిన ఫొటోను చాలా మంది విపరీతంగా షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అవును నిజమే.. నేను జానులిరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఇష్టపడ్డాం. కలిసి బతకాలనుకుంటున్నాం. మేము ఎలాంటి తప్పూ చేయలేదు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. జానులిరి వాళ్ల ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోబోతున్నాం.
Also Read : మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!
Janulyri news Dilip Devgan Clarity on Love
Also Read : మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!
అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు. ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా.. తట్టుకుని నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా థాంక్యూ సోమచ్’’ అంటూ ఆ వీడియోలో పంచుకున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తూ కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం జాను లిరిని ఫూల్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. నిన్ననే ఆమె ఏడుస్తూ తమ మధ్య ఏమీ లేదని చెబితే.. ఇవాళ తాము పెళ్లి చేసుకుంటున్నాం అని దిలీప్ వీడియో రిలీజ్ చేసి ఆమెను ఫూల్ చేశాడని అంటున్నారు.
Also Read : నేనలా అనలేదు.. వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ!..
janu lyri | janulyri dance | Janulyri on Social Media Trolls | latest-telugu-news | telugu-news