డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్

రష్మిక మందన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. నా రెమ్యునరేషన్‌ గురించి ఏవేవో రాశారు. నేను డబ్బు గురించి అస్సలు పట్టించుకోను. నాకు క్యారెక్టర్‌ ముఖ్యం. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ.. ఫ్రీగా మాత్రం చేయకూడదనేది నా పాలసీ అంటూ చెప్పుకొచ్చింది.

New Update
rashmika 001

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దుకుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 'పుష్ప2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకుంది. 

సినిమాలో తన పాత్రకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కు ఆనందం వ్యక్తం చేసిన రష్మిక.. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది." శ్రీవల్లి లాంటి పాత్ర చేసినందుకు నన్నందరూ మంచి నటి అని మెచ్చుకుంటున్నారు. కానీ నా స్కూల్‌ టైమ్‌లో ఓసారి స్టేజ్‌ షో చేశా. అది ఎవరికీ నచ్చలేదు.

Also Read : సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

కొందరైతే.. ‘ఇంకెప్పుడూ నటించకు’ అని ఉచిత సలహా కూడా ఇచ్చారు. నా రెమ్యునరేషన్‌ గురించి ఏవేవో రాశారు. నిజానికి డబ్బు గురించి అస్సలు పట్టించుకోను. తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం కేవలం రెండున్నర లక్షలు. 

అలాంటి పాత్ర చేయాలి..

నాకు క్యారెక్టర్‌ ముఖ్యం. డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ.. ఫ్రీగా మాత్రం చేయకూడదనేది నా పాలసీ. ఓ మంచి బయోపిక్‌లో నటించాలి. అలాగే.. ‘బాహుబలి’లో దేవసేన లాంటి పాత్ర చేయాలి. ఈ రెండు కోరికలు ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్నా.." అని తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు