దారుణం.. నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా..

ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ  ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

New Update
madhya pradesh accident

madhya pradesh accident Photograph: (madhya pradesh accident )

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళ భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ కారులో తన భర్తతో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దురదృష్టకరమైన ఈ ఘటనలో ఆమె భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను  వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read :  Hyderabad: మహీంద్రా షోరూమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..భారీ ఆస్తి నష్టం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాతిబాద్‌కు చెందిన బబ్లీ అనే మహిళ గర్భవతి. ఆమెకు మంగళవారం అర్థరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో, ఆమె భర్త మహేంద్ర ఆమెను ఆల్టో కారులో తీసుకుని భోపాల్‌కు బయలుదేరాడు. కారులో వీరితో పాటు మహేంద్ర తల్లి, అత్త, బావ కూడా ఉన్నారు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో హలాల్‌పూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. మహేంద్ర తల్లి బటాషి బాయి చేతులు, భుజాలు మరియు కాళ్ళలో ఫ్రాక్చర్ కాగా, అతని సోదరికి కూడా గాయాలయ్యాయి. 

Also Read :  Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప

దీంతో వారందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు, అయితే వైద్యులు మహేంద్ర మేవాడ అతని బావమరిది సతీష్ చనిపోయినట్లు ప్రకటించారు. ఇది జరిగిన గంట తర్వాత, మహేంద్ర భార్య బాబ్లీ అర్థరాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం, తల్లి, నవజాత శిశువు ఇద్దరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు.  మహేంద్ర మూడు సంవత్సరాల క్రితం బాబ్లీని వివాహం చేసుకున్నాడు. వారికి ఇదే మొదటి సంతానం. ముగ్గురు తోబుట్టువులలో మహేంద్ర రెండవవాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు కోహ్-ఎ-ఫిజా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి బ్రజేంద్ర మార్స్కోల్ తెలిపారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.  

Also Read :  బీజేపీ నుంచి నాకు సీఎం ఆఫర్‌ .. మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు